తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.అయినప్పటికీ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ( Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh )లాంటి నటులు మాత్రం ఇప్పటికి కూడా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఒకప్పుడు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా కొనసాగిన వీళ్లు ఇప్పుడు కూడా అదే ఊపులో వరుస సినిమాలను లైన్ లో పెట్టి ముందుకు దూసుకెళ్తున్నారు.మరి వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ నలుగురు హీరోల సినిమాలు ఇప్పటికి కూడా ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.కానీ వీళ్ళ నుంచి మంచి సినిమాలు మాత్రం రావడం లేదు.ఇక వీళ్ళ సినిమాలు సక్సెస్ సాధించినప్పటికీ అవి ప్రేక్షకులను అలరించే సినిమాలు మాత్రం వీళ్ళు చేయడం లేదంటూ చాలామంది వీళ్ళ అభిమానులే వీళ్ళ మీద విమర్శలతో చేస్తున్నారు.ఇక ఇప్పటికి కూడా కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగిపోవడమే దానికి కారణం అంటూ మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
ఇక ఇప్పటికైనా వీళ్ళు కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తే చూడాలని వాళ్ళు అనుకుంటున్నారట.
కానీ వీళ్ళు మాత్రం ఇప్పటికి హీరోయిజం చూపిస్తూ, రొమాంటిక్ సాంగ్స్, డ్యూయట్ సాంగ్స్( Romantic Songs, Duet Songs ) పాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు.ఇక ఇప్పటికైనా వీళ్ళు సినిమాలు తీసే విధానం మారాలి.అలాంటప్పుడే ఇంకా వీళ్ళని ఎక్కువగా ఆదరించే అవకాశాలు ఉంటాయని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… మరి ఇప్పటికైన వీళ్లు మారి మంచి సినిమాలు చేస్తే చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… చూడాలి మరి ప్రేక్షకుల కోరిక మేరకు వీళ్ళు అలాంటి సినిమాలు చేస్తారా లేదా అనేది…
.