నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.శాసనమండలి సమావేశాలు రేపు( జులై 24) ఉదయం 10 గంటలకుయ ప్రారంభమవుతాయి.

 Telangana Assembly Budget Meetings From Today, Telangana Assembly ,budget Meetin-TeluguStop.com

అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది.ఇవాళ ఉదయం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభలో సంతాపం ప్రకటించనున్నారు.

ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.ఇక ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీలో నివాళులర్పించనున్నారు.

ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేయనున్నారు.

ఆ తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది.

ఈ సమావేశంలో సభ ఎజెండా,అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేసే అవకాశం ఉంది.రేపు రైతు రుణమాఫీ అంశంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.అలాగే,ఈ నెల 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.26వ తేదీన సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు.ఇక ఈ నెల 27న బడ్జెట్‌ ప్రసంగంపై చర్చ జరగనుంది.

బోనాల పండుగ నేపథ్యంలో 28,29 తేదీల్లో మళ్లీ సభకు విరామం ఇవ్వనున్నారు.

ఆ తర్వాత 30వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి.ఈ సెషన్స్ లో స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్‌ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది.ఈ మీటింగ్ లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube