మండల కేంద్రంలో మడుగును తలపిస్తున్న దారి...!

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేంద్రంలోని 9వ,వార్డు కూరగాయాల మార్కెట్ వెనుక ఉన్న కాలనీలో ప్రధానరహదారి పాదచారులు కూడా నడవలేని అద్వాన్నస్థితిలో ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్నపాటి చినుకుపడితే చాలు చిత్తడిగా మారి అనేక ఇబ్బందులు పడుతున్నామని,బురద మయం కావడంతో దోమలు, ఈగలు విపరీతంగా వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

 Road Leads To The Lagoon In The Center Of The Mandal, Nalgonda District, Munugod-TeluguStop.com

మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నప్పటికీ పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలే జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో రహదారి మొత్తం బురద,చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube