కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు బర్త్ డే పార్టీలు సెలెబ్రేట్ చేయడం కామన్.కానీ ఎప్పుడైనా ఏనుగుకు పుట్టినరోజు సెలెబ్రేట్ చేస్తుంటే చూశారా? పోనీ విన్నారా? ఏనుగుకు ఎవరు అలా చేస్తారనే కదా మీ అనుమానం.కానీ వాటికి కూడా ఇలాంటి పార్టీలు చేసే మంచి మనుషులు ఉన్నారు.తాజాగా ఓ ఎలిఫెంట్ బర్త్ డే పార్టీ వీడియో సోషల్ మీడియాగా మారింది.ఈ వీడియోలో చూడగానే నవ్వు ఆపుకోలేం.ఏనుగు పుట్టినరోజు వేడుక చాలా అరుదుగా జరుగుతుంది.
అలాంటి వేడుకలో ఏనుగు ఎంతో ఆనందంగా పాల్గొంటున్న దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా అనిపించాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు పుట్టినరోజు( Elephant s birthday ) వేడుకలను చాలా ఇష్టపడుతున్నారు.
ఈ వేడుకలో ఏనుగు చాలా హ్యాపీగా డ్యాన్స్ చేసింది.అది పర్పుల్ స్కార్ఫ్, పూల అలంకరణలతో పెళ్లి కూతురిలా కనిపించింది.ప్రత్యేకంగా తయారుచేసిన పళ్ళాల విందును ఆస్వాదిస్తోంది.ఆ ప్లేట్స్‌లో ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి.“హ్యాపీ బర్త్‌డే” అనే శుభాకాంక్షల మధ్య, ఏనుగు తలను ఊపుతూ, ఆనందంతో ఊగుతూ, సంబురాలకు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలో చక్కగా ముస్తాబైన ఏనుగును చూస్తే ఎవరైనా సరే ముగ్ధులవ్వాల్సిందే.
ఈ దుస్తులు, అలంకరణలు ఆ ఏనుగు పుట్టినరోజు వేడుకకు ఒక ప్రత్యేక శోభను తెచ్చాయి.ఏనుగుకు ఒక అద్భుతమైన, గుర్తుండిపోయే అనుభవాన్ని అందించడానికి ఎంతో శ్రద్ధ, ప్రేమ చూపించారో ఈ దృశ్యం స్పష్టంగా తెలియజేస్తుంది.
@natureisamazing అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియోలో కనిపించే ఏనుగు పేరు అఖిల.తమిళనాడు( Tamil Nadu)లోని ఒక ఆలయంలో తన 22వ పుట్టినరోజు జరుపుకుంటుంది.ఏనుగులు భారత సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి, ముఖ్యంగా ఆలయాలలో జరిగే పూజలు, వేడుకల్లో పాల్గొంటాయి.
ఈ వీడియోలో ఏనుగు పుట్టినరోజు వేడుక జరపడం వల్ల ఆలయ సంప్రదాయానికి మరింత ప్రాధాన్యత లభించింది.