తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుస సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్న బాలయ్య బాబు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఇకపోతే బాలయ్య బాబు గురించి మనందరికీ తెలిసిందే.
బాలయ్య బాబుని దగ్గర్నుంచి చూసినవారు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని చెబుతూ ఉంటారు.ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పడం కష్టం.
మంచికి మంచి.పంచ్ కి పంచ్ అనే స్టైల్లో ఉంటుంది.బాలయ్య తన అభిమానులతో ఒక్కోసారి ప్రేమగా నవ్వుతూ పలకరిస్తూ కనిపిస్తుంటాడు.ఇంకోసారి చేత్తో దెబ్బలు వేస్తూ కనిపిస్తుంటాడు.బాలయ్యకు చిరాకు వస్తే అవతలి వాడికి మూడినట్టే.చేతిలో ఉన్న ఫోన్లను తీసి అవతల పారేస్తుంటాడు.
అలాంటి బాలయ్య వద్దే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఒక నెటిజన్.తాజాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అలా ఫ్లైట్లో కూర్చున్న బాలయ్యని పక్క సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి వీడియో తీశాడు.బాలయ్యకు తెలియకుండా తీసుకున్న ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బాలయ్య అయితే కెమెరా వైపు చూడటం లేదు.ప్రస్తుతం ఈ వీడియో మీద నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.సింహం పక్క సీట్లో కూర్చొని సెల్ఫీ వీడియో తీసి వీడియో అప్లోడ్ చేసావంటే నీ ఫోన్ ఆయుష్షు మామూలుగా లేదు సోదరా అంటూ ఎవరో నెటిజన్ ఇలా వీడియోని షేర్ చేశాడు.ఈ ట్వీట్ కింద నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టేస్తున్నారు.
బాలయ్య బాబు చూసి ఉంటే నీ పరిస్థితి ఏంటి సోదరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.