మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ రైటేనా అంటూ ప్రశ్న.. కిరణ్ అబ్బవరం జవాబు ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అతి త్వరలో ఈ హీరో ( Ka Movie ) అనే వెరైటీ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Kiran Abbavaram Comments About Pan India Movie Meaning Details, Kiran Abbavaram,-TeluguStop.com

ఈ సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు కాగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.అయితే ఈ సినిమా టీజర్ లాంఛ్ సందర్భంగా మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ( Pan India Movie ) రైటేనా అంటూ కిరణ్ అబ్బవరంకు ప్రశ్న ఎదురైంది.

సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే ఎవరైనా సీరియస్ కావడం జరుగుతుంది.గతేడాది మీటర్, రూల్స్ రంజాన్ సినిమాలతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.

సుజీత్, సందీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన క సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కిరణ్ అబ్బవరం నా దృష్టిలో పాన్ ఇండియా స్థాయి అంటే కేవలం కంటెంట్( Content ) మాత్రమేనని అన్నారు.

Telugu Kiran Abbavaram, Ka, Ka Teaser, Kantara, Kiranabbavaram, Rishab Shetty-Mo

యాక్టర్స్ పేర్లు తెలియకపోయినా మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారని కాంతార( Kantara ) సినిమాకు ముందు రిషబ్ శెట్టి( Rishab Shetty ) సైతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న యాక్టర్ కాదని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.ఇక్కడ ఫైనల్ గా స్థాయి అంటే కంటెంట్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.నా స్థాయి పెద్దదా చిన్నదా అనే విషయం తర్వాత విషయం అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

Telugu Kiran Abbavaram, Ka, Ka Teaser, Kantara, Kiranabbavaram, Rishab Shetty-Mo

క అనే సినిమాలో కంటెంట్ ఉందని నమ్ముతున్నానని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.కంటెంట్ ఉంటే మాత్రమే సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారని అందుకే ఇతర భాషల్లో సైతం ఈ సినిమాను తీసుకొస్తున్నామని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.కిరణ్ అబ్బవరం వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube