అలాంటి కామెంట్లు చేయడం రైటేనా నాగ్ అశ్విన్.. ఎవరి టాలెంట్ వారిదని గుర్తించాలంటూ?

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD Movie ) సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) అని అందరూ భావిస్తున్నారు.

 Netizens Reaction About Nag Ashwin Negative Comments Details, Nag Ashwin, Direct-TeluguStop.com

కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పటికే 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.అయితే నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ ను డిలీట్ చేయడం జరిగింది.

నాగ్ అశ్విన్ తాజాగా తన పోస్ట్ లో సందీప్ రెడ్డి వంగాను( Sandeep Reddy Vanga ) టార్గెట్ చేయడం జరిగింది.“రక్తం చిందించకుండా బూతులు లేకుండా వయొలెన్స్ లేకుండా సినిమా హిట్టైంది” అనే పోస్ట్ పెట్టి నాగ్ అశ్విన్ డిలీట్ చేశారు.అయితే ఈ పోస్ట్ వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎవరి టాలెంట్ వారిదని ఎవరి స్టైల్ వారిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Animal, Nag Ashwin, Kalki, Prabhas, Sandeepreddy, Tollywood-Movie

నాగ్ అశ్విన్ పదేళ్ల సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదు.అందరివాడుగా ఈ దర్శకుడు పేరు సంపాదించుకున్నారు.నాగ్ అశ్విన్ 600 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తే సందీప్ రెడ్డి వంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే మ్యాజిక్ చేస్తున్నారు.బూతులు, శృంగార సన్నివేశాలతో చాలామంది యంగ్ డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నా ఆ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.

Telugu Animal, Nag Ashwin, Kalki, Prabhas, Sandeepreddy, Tollywood-Movie

కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ కావడంతో నాగ్ అశ్విన్ ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని నాగ్ అశ్విన్ గత సినిమాల కలెక్షన్లు ఎంతంటూ కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.శత్రువులను తయారు చేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని నాగ్ అశ్విన్ కు నెటిజన్లు సూచిస్తున్నారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాగ్ అశ్విన్ కు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube