వైరల్ వీడియో: ఇవే తగ్గిచుకుంటే బాగుపడతారు.. ముంబై లోకల్ ట్రైన్‌లో డేంజర్ స్టంట్..

ప్రస్తుతం యువత కోసం మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ చివరికి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలానే చూసి ఉంటాం.

 Young Boy Dangerous Stunts By Hanging The Train At Mumbai Railway Station Video-TeluguStop.com

ఇలా ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న సమయంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.తాజాగా ఓ ప్రమాదకర విన్యాసం( Dangerous Stunt ) సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం లోకల్ ట్రైన్ లో( Mumbai Local Train ) కొందరు యువత మితిమీరిన ఆగడాలకు పాల్పడుతున్నారు.ఇందుకు సంబంధించి తాజాగా ఓ వ్యక్తి ముంబై నగరంలోని లోకల్ ట్రైన్ కదులుతుండగా దానిని పట్టుకొని ప్లాట్ ఫామ్ పై విచిత్ర ప్రమాదకర విన్యాసాన్ని చేశాడు.

ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో పై తాజాగా సెంట్రల్ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది.ముంబై నగరంలోని సర్వి రైల్వే స్టేషన్ లో ( Sewri Railway Station ) కదులుతున్న లోకల్ ట్రైన్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు ఎక్కుతున్నట్లు ఓ రైలు డోర్ వద్ద కడ్డీని గట్టిగా పట్టుకొని ఫ్లాట్ఫారంపై విచిత్ర రీతిలో ట్రైన్ తో పాటు దూసుకు వెళ్ళాడు.ట్రైన్ ముందుకు కదలతున్న కొద్దీ ప్లాట్ఫామ్ పై జారుతూ ప్రమాదకర విన్యాసాన్ని చేశాడు.

ఇలా చేయడం వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగిన ప్లాట్ఫామ్ పైనుంచి క్షణాల వ్యవధిలో పట్టాలపై పడి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

అయినా గాని అవన్నీ లెక్క చేయకుండా ఆ వ్యక్తి ప్రమాదకర విన్యాసాన్ని చేశాడు.ఇకపోతే ఈ వీడియోలోని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సెంట్రల్ రైల్వే ఆర్పిఎఫ్ సిబ్బందిని ఆదేశించింది.దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే తమ రైల్వే ప్రయాణికుల భద్రత వారి సురక్షితం ప్రయాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదకర సంఘటనలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని హెచ్చరించింది.

ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా కనపస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని రైల్వేకి తెలపాలని సెంట్రల్ రైల్వే విజ్ఞప్తి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube