1000 కోట్ల క్లబ్ లో చేరిన కల్కి... నిజమైన విజయ్ దేవరకొండ జోస్యం?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన తాజా చిత్రం కల్కి( Kalki ) .ఈ సినిమా జూన్ 27వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యంత ఆదరణ సొంతం చేసుకుంది.

 Vijay Devarakonda Post Viral About Kalki Collections ,vijay Devarakonda, Kalki M-TeluguStop.com

డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ఇటీవలే 1000 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

Telugu Kalki, Prabhas, Tollywood-Movie

ఇక ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) చెప్పిన జోస్యం నిజమైంది అంటూ విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో ఈయన పాత్ర చాలా తక్కువగా ఉన్న రాబోయే భాగంలో ఈయన పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.

Telugu Kalki, Prabhas, Tollywood-Movie

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రాన్ని చూసిన విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ఇప్పుడే సినిమా చూసాను మాటలు లేవు, ఇండియన్ సినిమా దగ్గర కొత్త అధ్యాయంకి తాళం తెరుచుకుంది.ఈ సినిమా 1000 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.

అయితే ఈయన చెప్పిన విధంగానే ఈ సినిమా 1000 కోట్లను రాబట్టి సంచలనం సృష్టించింది.అయితే ఇప్పటివరకు తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లు సాధించాయి ఇక మూడో సినిమాగా కల్కి రికార్డు సృష్టించింది.

ఇప్పటివరకు ప్రభాస్ నటించిన బాహుబలి 2, అలాగే RRR సినిమాలు మాత్రమే వేయ్యి కోట్లకు పైగా రాబట్టాయి.ఇప్పుడు మూడవ సినిమాగా కల్కి అదే స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube