ఈ సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే ఏజ్ పెరిగిన యంగ్ గానే కనిపిస్తారు!

ఏజ్ పెరుగుతున్నా యంగ్ గానే కనిపించాలన్న కోరిక మనలో చాలా మందికి ఉంటుంది.చర్మాన్ని యవ్వనంగా మెరిపించుకోవడం కోసం ఖరీదైన క్రీమ్, సీరం, లోషన్ తదితర ఉత్పత్తులన్నీ వాడుతుంటారు.

 Follow This Simple Home Remedy For Youthful Skin! Youthful Skin, Simple Home Rem-TeluguStop.com

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కా మాత్రం ఏజింగ్ ను ఆలస్యం చేయడంలో, చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

మరి ఇంతకీ ఆ ఇంటి చిట్కా ఏంటి అనేది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ తో రెండు సార్లు కడగాలి.

ఆపై అందులో పావు కప్పు పాలు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Simple Remedy, Skin, Skin Care, Skin Care Tips, Youthful Sk

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ( Almond oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒకటికి రెండు సార్లు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు వదిలేయాలి.ఈ లోపు చర్మం పూర్తిగా డ్రై అవుతుంది.

అప్పుడు వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Simple Remedy, Skin, Skin Care, Skin Care Tips, Youthful Sk

వారానికి రెండు సార్లు ఈ ఇంటి చిట్కాని పాటిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ఈ చిట్కా మీ చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.ముడతలు గీతలు పడకుండా అడ్డుకట్ట వేస్తుంది.

ఏజ్ పెరుగుతున్నా కూడా మీ చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.పైగా ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.

చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. స్కిన్ ను స్మూత్ గా మరియు షైనీ గా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube