ఓరి నాయనో.. ఇదేం జీవి.. వీడియో చూస్తే షాకే...

లోతైన సముద్రాల్లో మనకు తెలియని, ఇంకా ఎన్నో జీవులు ఉన్నాయి.కొన్ని అందంగా ఉంటే, మరికొన్ని మనుషులకు భయం కలిగించేవి కూడా ఉంటాయి.

 Strange Red Coloured Creature Spotted By Whale Watchers On Sea Shore Video Viral-TeluguStop.com

ఇలాంటి ఓ భయంకరమైన జీవి వెలుగులోకి వచ్చింది.వేల్‌ వాచెర్స్ టీమ్ ఓ విచిత్రమైన జీవిని చూసి ఆశ్చర్యపోయారు.

ఇది లోతైన సముద్రం( Deep Water ) నుంచి బయటకు వచ్చి ఉంటుందని వారు అనుకున్నారు.ఆ వింత జీవి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.

వేల్‌ వాచెర్స్( Whale Watchers ) కనుగొన్న జీవి అమెరికన్ రక్తపు పురుగు( American Bloodworm ) అని తెలిసింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

దీన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఈ రక్తపు పురుగు శాస్త్రీయ నామం గ్లిసెరా అమెరికానా( Glycera Americana ) అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ “శీతాకాలంలో అభయారణ్యానికి వలస వచ్చే వేలాది తీర పక్షులకు రక్తపు పురుగులు ఆహారం అవుతాయి.ఈ పురుగు ఒక ఫాస్టెస్ట్ బురోయింగ్ వేటగాడు, దాని పొడవైన, గుండ్రని, కోరలతో కూడిన గొంతును వేటాడటానికి ఉపయోగిస్తుంది.గొంతుపై ఉన్న దవడలు సెరోటోనిన్, ప్రోటీయోలిటిక్ ఎంజైమ్‌లతో కూడిన న్యూరోటాక్సిన్‌తో( Neurotoxin ) విషపూరితమైనవి.మానవులకు వాపును కలిగిస్తాయి.” అని వివరించారు.ఈ పోస్ట్ ఈ జీవి విషపూరితమైనదని, ఈ జీవితో కాంటాక్ట్ అయితే ప్రాణాంతకం కావచ్చని స్పష్టంగా చెబుతుంది.

వీడియో క్యాప్షన్ లో దీని గురించి మరింత వివరంగా రాశారు, “గ్లిసెరిడే కుటుంబానికి చెందిన జీవులను రక్తపు పురుగులు అని పిలుస్తారు.ఎందుకంటే వాటిని కోస్తే, అవి తరచుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగు రక్తం లేదా సెలోమిక్ ద్రవాన్ని విడుదల చేస్తాయి.ఈ ద్రవం ఎరుపు రంగు హిమోగ్లోబిన్ వల్ల సంభవిస్తుంది, ఇది ఎర్ర రక్త కణాలలో ఉంటుంది.” అని క్యాప్షన్ లో రాశారు.ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది, 1.1 లక్షలకు పైగా వ్యూస్ పొందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube