సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళ సెపరేట్ స్టైల్ లో సినిమాలను తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒక్కో దర్శకుడికి ఒక్కో జానర్ లో మంచి పట్టు ఉంటుంది.
అలాంటి సబ్జెక్టులనే ఎంచుకొని వాళ్ళు అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.మరి ఇలాంటి క్రమంలోనే కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవడంలో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) సిద్ధహస్తుడు అనే విషయం మనందరికీ తెలిసిందే…
మరి ఆయన ఇప్పుడు రామ్( Ram Pothineni ) ను హీరోగా పెట్టి ‘డబుల్ ఇస్మార్ట్( Double iSmart )’ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక మొత్తానికైతే ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘స్టెప్పామార్ ‘ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు.ఆ సాంగ్ కు విశేషమైన ఆదరణ రావడం విశేషం… ఇక మొత్తానికైతే రామ్ తనదైన రీతిలో ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
అలాగే పూరి జగన్నాథ్ కూడా చాలా సంవత్సరాల నుంచి సక్సెస్ లేకుండా ఉంటున్నాడు.)కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోతో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆయన ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా తీస్తున్నాడు.
ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… పూరి జగన్నాథ్ గత సినిమాలను మినహాయిస్తే ఇప్పుడు ఆయనకు అర్జెంటుగా హిట్ అయితే కావాలి.ఈ సినిమాతో కనక హిట్ కొడితే ఆయనకు ప్రభాస్( Prabhas )కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి తప్పకుండా ఆయనకు ఈ సినిమాతో సక్సెస్ అయితే రావాల్సిందే…