షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) పరిచయం అవసరం లేని పేరు.యూట్యూబర్‌గా మొదలైన షన్ను ప్రయాణం బిగ్ బాస్( Bigg Boss ) షోతో పడిపోయింది.
ఈయన ఎన్నో వెబ్ సిరీస్ లను చేస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన పై పూర్తిగా నెగిటివిటీ రావడంతో అప్పటివరకు సొంతం చేసుకున్న క్రేజ్ మొత్తం తగ్గిపోయింది.
హౌస్ లో సిరి తో ఈయన వ్యవహారం కారణంగా తన లవ్ కూడా బ్రేకప్ అయ్యింది.అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ వంటి కేసులు కూడా తనని వెంటాడటంతో ఈయన కోలుకోలేకపోతున్నారు.
ఇకపోతే సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకొని షన్ను తాజాగా సీఏ స్టూడెంట్ల కోసం ఎవరో పెట్టిన ఆ పోస్ట్‌ను షేర్ చేశాడు.పిల్లల మీద చదువులు, ఉద్యోగాలు అంటూ ఒత్తిడి పెంచకండని, తల్లిదండ్రులు తమ తమ పిల్లలతో స్నేహ పూర్వకంగా ఉండండి.వారితో మనసు విప్పి మాట్లాడండి అంటూ ఒక పోస్ట్ ఉంది.అయితే ఆ పోస్టును ఈయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.
ఇది కేవలం స్టూడెంట్స్ కి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.అదేవిధంగా తన జీవితంలో జరిగిన అనుభవాలను కూడా అందరితో పంచుకున్నారు నేను కూడా గతంలో చాలా సార్లు సూసైడ్ చేసుకొని చనిపోదాము అనుకున్నాను కానీ మనం చనిపోతే మనల్ని ఎవరూ పట్టించుకోరు కేవలం మా తల్లిదండ్రులు మాత్రమే బాధపడతారు ఈ ప్రపంచం అసలు పట్టించుకోదు అందుకే ఇలాంటి ఆలోచనలు మానేయాలని తెలిపారు.ఎప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్ నేను ఏదైనా సాధించగలను అనే మంత్రం మాత్రమే జపించాలి అంటూ ఈయన స్ఫూర్తిని నింపే కామెంట్లు చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.