రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 10-07-2024 రోజున బైపాస్ రోడ్డులో, కాలేజీ గ్రౌండ్ లో బైక్ లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి బైకులను స్వాదినపరుచుకొని వారిపై నూతన చట్టాల ప్రకారం కటిన శిక్షలు పడే విదంగా కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఎవరైనా ఇతరుల ప్రాణాలకు హాని కల్గించే విదంగా, ప్రాణాలమీదకు తెచ్చుకునే విదంగా ప్రమాదకరమైన విన్యాసాలు చేసినట్లైతే వారిపై కటిన చర్యలు తీసుకొంటామన్నారు.
యువత ప్రమాదకరంగా
1.SPEED DRIVING,
2.STUNTS,
3.RACING AND TRAILING,
4.OVER SPEED,
5.RASH AND NEGLIGENT DRIVING,
6.6.TRIPLE RIDE,7.WITHOUT HELMET,
8.DRINK & DRIVE,
9.WITHOUT INSURANCE
10.WITHOUT DRIVING LICENSE,
ఎటువంటి ట్రాఫిక్ నిబందనలు పాటించకపోయిన వారిపై నూతన చట్టాల రీత్యా కటిన చర్యలు తీసుకొనబడును మరియు మైనరు పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కటిన చర్యలు తీసుకొనబడునని తెలిపారు.
ఎస్పీ రాజన్న సిరిసిల్ల ఆదేశాల మేరకు ఎవరైనా రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేసినట్లైతే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.