రామ్ చరణ్( Ramcharan ) శంకర్ కాంబినేషన్ లో ఒకింత భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ సినిమా( game changer movie ) తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఒకింత గందరగోళం నెలకొంది.
అయితే భారతీయుడు2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ గేమ్ ఛేంజర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గేమ్ ఛేంజర్ మాస్ మూవీ అని శంకర్ వెల్లడించడం గమనార్హం.
శంకర్ మూడు సంవత్సరాల పాటు కష్టపడి మాస్ సినిమా తీశారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.నేను తెరకెక్కించిన తమిళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కిందని ఆయన తెలిపారు.
అందుకే నేరుగా తెలుగులో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉండేవాడినని శంకర్ పేర్కొన్నారు.ఆ మేరకు నేను చేసిన కొన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని ఆయన వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ సినిమాతో నా కల నెరవేరుతోందని శంకర్ పేర్కొన్నారు. కార్తీక్ సుబ్బరాజు ( Karthik Subbaraju )కథతో ఈ సినిమా రూపొందుతోందని శంకర్ వెల్లడించారు.ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా అని ఆయన పేర్కొన్నారు.కొంతమంది మాత్రం రామ్ చరణ్ చాలా కాలం తర్వాత మాస్ సినిమాలో నటిస్తున్నాడంటూ ఫైర్ ఎమోజీలు జత చేస్తున్నారు.
ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ పూర్తైన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.మరోవైపు భారతీయుడు2 సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం జరుగుతోంది.రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.