నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ రియల్ గబ్బర్ సింగ్ లా మారి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ వివాహితకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.నాతో కోఆపరేట్ చేస్తే నీకు న్యాయం చేస్తా అంటూ అంతటితో ఆగకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి,చేపల కూర,చికెన్ కర్రీ,గ్రీన్ టీ చేసి పెట్టాలని తన కోరికల చిట్టా ఓపెన్ చేసేశాడు.
అంతే కాదండోయ్.మరొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు.
ఒకవేళ నువ్వు సహకరించకపోతే మీ కుటుంబంలో గొడవలు సృష్టిస్తా,నీకు మనశ్శాంతి లేకుండా చేస్తానని హీరో కం విలనిజం రెండూ కలిపి అసలైన ఫెండ్లి పోలీసింగ్ అంటే అర్దం చూపిస్తా అంటూ డ్రీమ్ డ్యూయెట్లు వేసుకున్నాడు.
సీన్ కట్ చేస్తే సదరు బాధిత మహిళ సారువారి సరసాలు చూసి షాక్ కు గురై పోలీస్ ఉన్నాధికారులకు కథ మొత్తం చెప్పేసింది.
దీంతో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాసా వారిని వీఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం అసలు కథ ఏమిటంటే…శాలిగౌరారం మండల పరిధిలోని ఓ భూ వివాదంలో న్యాయం కోసం ఫిర్యాదు చేయడానికి ఓ వివాహిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.దీనిని అడ్డంపెట్టుకొని ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ ఆమె గురించి పూర్తిగా తెలుసుకొని,ఆ తర్వాత స్టేషన్‌కు పిలిపించి తన మనసులో మాట బయట పెట్టాడు.
భర్తతో ఎందుకు దూరంగా ఉంటున్నావ్.? అతనితో ఉండటం ఇష్టం లేదా.?తనకు సహకరిస్తే కేసును పరిష్కరిస్తా.ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి.
తనకిష్టమైన వంటకాలు చేసి పెట్టాలని అసభ్యంగా ప్రవర్తిస్తూ.అంతటితో ఆగకుండా నువ్వు కోఆపరేట్ చేయకపోతే మీ కుటుంబంలో గొడవలు సృష్టిస్తా అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఖాకీ పెట్టే లైంగిక వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది.దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించి,వీఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా సైదులును నియమించారు.నివేదిక వచ్చిన తర్వాత అతనిపై ఏ విధమైన చర్యలు ఉంటాయో చూడాలి మరి.!
.