టార్గెట్ జగన్... పులివెందుల నుంచే మొదలుపెట్టిన బాబు

గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంను టార్గెట్ చేసుకుని, అక్కడ చంద్రబాబు ఓటమే లక్ష్యంగా అప్పటి సీఎం జగన్( Jagan ) అనేక వ్యూహాలు రచించారు.  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కుప్పంలో రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నం చేశారు.

 Target Ys Jagan Cm Chandrababu Order Inquiry On Pulivendula Mega Layout Details,-TeluguStop.com

  కానీ ఎన్నికల ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఘోరంగా ఓటమి చెందడం,  కుప్పంలోనూ భారీ మెజారిటీతో చంద్రబాబు గెలవడం జరిగాయి.ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు.

శాఖల వారీగా చోటు చేసుకున్న అవినీతిని బయటకు తీస్తూ,  గత వైసిపి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారిని టార్గెట్ చేసుకున్నారు.

  తాజాగా వైసిపి అధినేత , మాజీ సీఎం జగన్ కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గం( Pulivendula Constituency ) పైన చంద్రబాబు పూర్తిగా ఫోకస్ చేశారు.దీనిలో భాగంగానే పులివెందులలో చోటుచేసుకున్న అక్రమ వ్యవహారాలను వెలికి తీసే విధంగా విచారణకు ఆదేశించారు.

 ఈ మేరకు టిడిపి ఎమ్మెల్యేతో సిఐడి కి ఫిర్యాదు చేయించారు.

Telugu Bhumiramgopal, Bonda Uma, Cm Chandrababu, Jagan, Kadapa, Mlatopudurthi, P

వైఎస్సార్ జిల్లా పులివెందులలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ అనుచరులు అరాచక పాలన సాగించారని,  టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.స్థానికంగా జగనన్న మెగా లేఅవుట్( Jagananna Mega Layout ) వేశారు దీంట్లో నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల ఎంపిక చేయడంతో పాటు,  ఇళ్ల నిర్మాణం జరగకుండానే హౌసింగ్ కార్పొరేషన్( Housing Corporation ) నుంచి బిల్లులు కూడా తీసుకున్నారు.గత వైసిపి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం మూడు ఆప్షన్లను ఇచ్చింది.

దీంట్లో మూడో ఆప్షన్ అయిన తామే ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.జగనన్న లేఅవుట్ లో మొత్తం 8400 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి 690 ఇళ్లకు పనులను అప్పగించారు.

కానీ నిర్మించిన ఇళ్ళు మాత్రం 99 మాత్రమే .కానీ 84 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం చెల్లించేశారు.

Telugu Bhumiramgopal, Bonda Uma, Cm Chandrababu, Jagan, Kadapa, Mlatopudurthi, P

దీనిపై టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి( Bhumireddy Ramgopal Reddy ) సిఐడి కి ఫిర్యాదు చేశారు దీనిపై చంద్రబాబు విచారణకు ఆదేశించారు అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం,  పనులు పూర్తిగా కాకుండా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు మొదలుకాలనుంది .అలాగే ఇడుపులపాయ వైఎస్సార్ స్మారక  నాలెడ్జ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన 23 వైఎస్ విగ్రహాల వ్యవహారం పైన విచారణ కోరుతూ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ సిఐడి కి ఫిర్యాదు చేశారు.ఇడుపులపాయలో 10 కోట్లతో మొత్తం 23 విగ్రహాలు ఏర్పాటు చేశారని , ఇందులో ఒకే విగ్రహం కోసం 7.61 కోట్లు ఖర్చు పెట్టారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా( Bonda Uma ) ఫిర్యాదు చేశారు.మిగిలిన విగ్రహాలకు డబ్బులు ఖర్చు పెట్టారని , ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.మొత్తంగా పులివెందుల నుంచే అవినీతి వ్యవహారాలను వెలికితీస్తే అది రాజకీయంగాను తమకు కలిసి వస్తుందనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube