రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) ఎస్ఐ రమాకాంత్ అద్వర్యంలో అటో డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.ఆటో డ్రైవర్లకు సమావేశం ఏర్పాటు చేసి అజాగ్రత్తగా , అతివేగంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనాలు నడిపి ప్రయాణీకుల మరణానికి కారణమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు.మితిమీరిన వేగంతో , అలాగే పరిమితికి మించి వాహనాలు నడిపవద్దని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు( Traffic regulations ) ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైన విడిచిపెట్టేది.లేదన్నారు.
ఇటివల రాజన్నపేటలో ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మరణానికి కారకుడయ్యాడు.యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని సూచనలులిచ్చారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.ఈ సమావేశంలో ఆటో యజమానులు డ్రైవర్లు ఉన్నారు
.