కల్కి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన నాగ్ అశ్విన్( Nag Ashwin ) ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన పాన్ ఇండియా డైరెక్టర్లలో తను కూడా టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడమే కాకుండా గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీయడంలో తను కూడా ఎక్స్ పర్ట్ అని నిరూపించుకున్నాడు.ఇక 600 కోట్లతో తెరకెక్కిన కల్కి సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయింది.
అందుకే ఈ సినిమాని ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తూ కలెక్షన్లు పెంచే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని సినిమా యూనిట్ అయితే మంచి కాన్ఫిడెంట్ గా ఉంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చిరంజీవి( Chiranjeevi )తో కథ చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.చిరంజీవి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సినిమా తర్వాతే ఒక సినిమా చేయాలనుకున్నాడు.
కానీ కల్కి ప్రాజెక్టు వల్ల అది వీలు కాలేదు.
కాబట్టి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసిన తర్వాత కల్కి 2 ను సెట్స్ మీద తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో కూడా ఆయన మరొక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక నాగ్ అశ్విన్ తో సినిమాలు చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరూ కూడా క్యూ కడుతున్నారనే చెప్పాలి…చూడాలి మరి చిరంజీవి సినిమాతో నాగ్ అశ్విన్ మరోసారి భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది…
.