విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) రష్మిక ఈ ( Rashmika ) జంటకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ గీతా గోవిందం వంటి సినిమాలలో నటించారు.
ఈ రెండు సినిమాల ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ రహస్యంగా కలిసి వెళ్తున్నారు కానీ వీళ్ళు చేసే సోషల్ మీడియా పోస్టులు మాత్రం ఒకేలా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ తరచూ వార్తలను వైరల్ చేస్తున్నారు.
ఇలా ఎక్కడికి వెళ్లిన రహస్యంగా జంటగా వెళ్లినప్పటికీ వీరు పెట్టే పోస్టుల ద్వారానే వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.ఇలా ఇప్పటికే ఎన్నో సార్లు వీరిద్దరూ దొరికిపోయారు తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి కల్కి సినిమా( Kalki ) చూశారని తెలుస్తోంది.వీరిద్దరూ కల్కి సినిమా గురించి ఒకేసారి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం పట్ల నేటిజన్స్ మరోసారి వీరి రిలేషన్ గురించి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి కల్కి సినిమా చూశారని అందుకే ఇలా ఒకేసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారంటూ కామెంట్లు చేస్తున్నారు.
కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా చూసిన అనంతరం విజయ్ దేవరకొండ ఇప్పుడే సినిమా చూసి వచ్చాను.అసలు నాకు ఏం.చెప్పాలో కూడా అర్థం కావడం లేదు.ఇండియన్ సినిమాలో ఒక కొత్త లెవెల్ అన్ లాక్ అయింది.ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలి అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.మరోవైపు రష్మిక సైతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ మై గాడ్.నాగ్ అశ్విన్.
మీరు ఒక జీనియస్.టీం మొత్తానికి.
నా అభినందనలు.మన మైథాలజికల్ దేవుళ్ళని వెండితెర మీద చూడటం చాలా సంతోషంగా అనిపించిందంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.