కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీ ఎస్ ) ఈ రోజు మృతి చెందారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన డి శ్రీనివాస్( D Srinivas ) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని( Hyderabad ) ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు.

 Congress Senior Leader D Srinivas Passed Away Details, D.srinivas, Revanth Redd-TeluguStop.com

ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతోనే డిఎస్ మరణించినట్లుగా కుటుంబ సభ్యులు  చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అధ్యక్షుడిగా , వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా డి.ఎస్ పని చేశారు.1948 సెప్టెంబర్ 27న డిఎస్ జన్మించారు నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన,  1989లో కాంగ్రెస్ లో చేరి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Telugu Congress, Congress Senior, Srinivas, Nizamabad, Revanth Reddy-Latest News

ఆ తరువాత 2004,  2009లో ఎమ్మెల్యేగా గెలిచారు నిజామాబాద్ కు( Nizamabad ) చెందిన డీఎస్ ఎక్కువకాలం కాంగ్రెస్ లో లోని ఉన్నారు.  వివిధ పదవులు అనుభవించారు.ఏపీ,  తెలంగాణ విభజన తర్వాత డిఎస్ బీఆర్ఎస్ పార్టీలో( BRS ) చేరారు.

  రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.ఆ తర్వాత  బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో( Congress ) చేరారు.

చాలా కాలంగా అనారోగ్యంతో ఉండడంతో ఆయన యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొనడం లేదు.ఇక డిఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Telugu Congress, Congress Senior, Srinivas, Nizamabad, Revanth Reddy-Latest News

పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్( Dharmapuri Sanjay ) గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్( Dharmapuri Aravind ) రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచారు .ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్నారు.డిఎస్ మృతిపై, అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు సీతక్క , గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం పభాకర్ ,  చెన్నూరు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు డిఎస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube