ఇక ప్రస్తుతం కల్కి సినిమాతో( Kalki Movie ) తెలుగు సినిమాల హవా మ్మొదలైందనే చెప్పాలి.ఇక ఇప్పటి నుంచి వరుసగా చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలందరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో వరుస రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి.కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాబోయే సినిమాల మీద భారీ అంచనాలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఈరోజు రిలీజ్ అయిన కల్కి సినిమా ఒక భారీ విక్టరీని సాధించబోతుంది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.కాబట్టి ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో మరిన్ని సినిమాలు రిలీజ్ అయి తమ సక్సెస్ ని భారీ ఎత్తున చాటాలని అలాగే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాయి.ఇక అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా( OG Movie ) మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి.మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కానీ ఈ సినిమా వస్తే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 ) కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.
డిసెంబర్ 6వ తేదీన వస్తున్న ఈ సినిమా కూడా చాలా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ఇక ఇవే కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్( Game Changer ) ఎన్టీఆర్ దేవర( Devara ) సినిమాలు కూడా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి… ఇక ఈ సినిమాలు విజయం సాధిస్తే ఇంక తెలుగు సినిమాల హవా అనేది పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి భారీ ఎత్తున ప్రూవ్ అవుతుంది…
.