భక్తులకు వేగంగా దర్శనం అయ్యేందుకు చర్యలు రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేయాలి ములవాగు పై వంతెన పనులు చేపట్టాలి.రాజన్న కోడెల సంరక్షణకు అన్ని ఏర్పాట్లు చేయాలి వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు త్వరగా మొదలు పెట్టాలి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడ రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, వేములవాడలో చేపట్టనున్న అభివృద్ది పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ ఈఓ, అధికారులతో కలిసి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందుగా విప్, కలెక్టర్ స్వామివారి ఆలయానికి వెళ్ళగా, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం వారిద్దరూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్, కలెక్టర్ కు ఆశీర్వచనం అందజేశారు.అనంతరం విప్ మాట్లాడారు.
గతంలో సమీక్షించిన పనులను త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.భక్తులకు బ్రేక్ దర్శనం ఏర్పాట్లను మొదలుపెట్టాలని దీని కోసం పనులు పూర్తి చేయాలని విప్ సూచించారు.
ఆధునిక పద్ధతుల్లో షెడ్లు
వేములవాడ రాజన్నకు ఎంతో ప్రీతి పాత్రమైన కోడె మొక్కులో కీలకమైన గోవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని విప్ ఆదేశించారు.వందలాది గోవులను సంరక్షచేలా ఆధునిక పద్ధతుల్లో షెడ్లు నిర్మించాలని ఆదేశించారు.
అలాగే గోశాల మొత్తం ఫ్లోరింగ్ సీసీ చేయించాలని, గోవులకు దాన, పచ్చిగడ్డి పెట్టాలని సూచించారు.
ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
వేములవాడ గుడి చెరువు అభివృద్ధి పనులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని విప్ ఆదేశించారు.
ఆలయ చెరువు ఆవరణలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలను విప్, కలెక్టర్ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా పార్క్, ఇతర నిర్మాణ పనులను మ్యాప్ లు పరిశీలించి,క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని సూచించారు.పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నటరాజ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు.
నూతన గదుల నిర్మాణం
రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం నూతన వసతి గృహాల నిర్మించాలని ఆదేశించారు.
గుడి చెరువులో 100 గదుల నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ సమీపంలో గదుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించి అందుకు స్థల పరిశీలన చేశారు.పోచమ్మ ఆలయ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
వేములవాడ రెండో బై పాస్ లో 60 స్టాల్స్
*వేములవాడ రెండో బై పాస్ రోడ్డు లో రూ.70 లక్షలతో 60 స్టాల్స్ నిర్మించనున్నమని విప్ తెలిపారు.కూరగాయల విక్రేతలుకు అనువుగా ఉండేలా ఈ పనులు చేపట్టనూనమని వీవరించారు.
రోడ్డు విస్తరణ ప్రత్యేక ప్రణాళిక
వేములవాడ పట్టణ ప్రజ లతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా వేములవాడ మూలవాగు బ్రిడ్జి తో పాటు బ్రిడ్జి నుండి గుడి ముందర వరకు మొదటి ఫేజ్ లో రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు.
రోడ్డు విస్తరణతో పాటు మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.
మురుగు నీరు చేరకుండా చర్యలు
వేములవాడ గుడి చెరువు, మూలవాగు లో పట్టణంలోని మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని విప్ సూచించారు.
చెక్కపల్లి క్రాస్ రోడ్, రెండో బైపాస్ రోడ్డులోని పార్క్ వద్ద మూలవాగులో కలుస్తున్న మురుగు నీటిని విప్, కలెక్టర్, అధికారులు పరిశీలించారు.పిల్ల కలువల ద్వారా గుడి చెరువు లో మురుగు నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని, ఎస్ టీ పీ ప్లాంట్ నిర్మించి, నీటిని శుద్ధి చేసి వదలాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఈఓ రామకృష్ణ, ఆలయ ఈఈ రాజేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
.







