‘నో ఫ్లై ’ లిస్టులో పేరు .. భారత సంతతి సిక్కు కార్యకర్తలకు కెనడా కోర్టులో చుక్కెదురు

నో ఫ్లై’ జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలంటూ ఇద్దరు భారత సంతతికి చెందిన సిక్కులు దాఖలు చేసిన పిటిషన్‌ను కెనడియన్ కోర్ట్ తోసిపుచ్చింది.వీరు తీవ్రవాద నేరానికి పాల్పడేందుకు విమానంలో ప్రయాణించే అవకాశం ఉందని అనుమానించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.

 Sikh Activists On Canada's No-fly List Lose Appeal , Parvkar Singh Dulai, Bha-TeluguStop.com

ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఈ వారం తన తీర్పులో భగత్ సింగ్ బ్రార్ , పార్వ్‌కర్ సింగ్( Parvkar Singh Dulai, Bhagat Singh Brar ) దులాయ్‌లు కెనడా సెక్యూర్ ఎయిర్ ట్రావెల్ యాక్ట్ ప్రకారం వారి ‘‘నో – ఫ్లై’ హోదాపై రాజ్యాంగ సవాల్‌ను కోల్పోయినందున అప్పీల్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

Telugu Canada, Lose Appeal, Delhi, Fly List, Parvkarsingh, Sikh-Telugu Top Posts

రవాణా భద్రతకు, తీవ్రవాద నేరానికి పాల్పడతారనే అనుమానం ఉన్న వ్యక్తులు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించే అధికారం కెనడా పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్‌కు ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.పిటిషన్‌దారులు విమానంలో ప్రయాణించేందుకు ప్రయత్నించారని, అయితే అప్పటికే వారు నో ఫ్లై లిస్టులో ఉన్నారని కోర్టు పేర్కొంది.గోప్యమైన సమాచారం ఆధారంగా వారు ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు విమానంలో ప్రయాణిస్తారని అనుమానించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.

Telugu Canada, Lose Appeal, Delhi, Fly List, Parvkarsingh, Sikh-Telugu Top Posts

వీరిద్దరిని 2018లో వాంకోవర్‌లో విమానాలు ఎక్కేందుకు అధికారులు అనుమతించలేదు.దీంతో తమను ఈ లిస్ట్ నుంచి తొలగించాలని బ్రార్, దులాయ్‌లు 2019లో కెనడాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.నో ఫ్లై జాబితాలో ఉంచడం వల్ల తమ హక్కులకు భంగం కలిగిందని వారిద్దరూ పిటిషన్‌లో పేర్కొన్నారు.కానీ జస్టిస్ సైమన్ నోయెల్ 2022లో వారిద్దరీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.

తీవ్రవాద దాడికి ప్లాన్ చేయడానికి వారు విదేశాలకు వెళ్తున్నారు అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.హక్కులు, స్వేచ్ఛలను గౌరవించే విధంగా జాతీయ భద్రత, గూఢచార కార్యకలాపాలను పరిరక్షించే చట్టాలను రూపొందించాలని, అంతర్జాతీయ సమాజాన్ని కూడా అదే విధంగా ప్రోత్సహించేలా చేయాలని కెనడా ప్రభుత్వానికి నోయెల్ సూచనలు చేశారు.

న్యూఢిల్లీ( New Delhi ) వర్గాల సమాచారం ప్రకారం .నిషేధిత బబ్బర్ ఖల్సాలో దులాయ్ సభ్యుడు.కెనడాలోని ప్రతిపక్ష న్యూడెమొక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్‌కు దులాయ్ అత్యంత సన్నిహితుడు.ఇతను సర్రే కేంద్రంగా ‘‘ఛానెల్ పంజాబీ ’’, చండీగఢ్ నుంచి ‘‘గ్లోబల్ టీవీ ’’ అనే మరో ఛానెల్‌ను నడుపుతున్నాడు.

రెండు ఛానెళ్లు ఖలిస్తానీ భావజాలాన్ని ప్రచారం చేస్తాయని ఆ వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube