12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉపాసన రాంచరణ్ దంపతులు..ఉపాసన పోస్ట్ వైరల్!

సినీ నటుడు, మెగా వారసుడు రామ్ చరణ్ ( Ramcharan ) ఉపసనను( Upasana ) పెళ్లి చేసుకొని 12 వసంతాలు పూర్తి అయింది.జూన్ 14వ తేదీ వీరి 12వ వివాహ వార్షికోత్సవం( 12 Wedding Anniversary ) కావడంతో ఉపాసన సోషల్ మీడియా వేదిక తమ పెళ్లిరోజును గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది.ఇక ఈ ఫోటోలో రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా తమ కుమార్తె క్లిన్ కారా( Klin Kaara ) చేతులు పట్టుకొని నడుస్తూ ఉన్నారు.

 Upasana Share Special Post On Her 12 Th Wedding Anniversary Upasana,ramcharan,-TeluguStop.com

అయితే ఇక్కడ కూడా వారి ఫేస్ కనపడకుండా వెనకనుంచి తీసిన ఫోటోని షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఉపాసన ఈ 12 సంవత్సరాల కాలంలో తనకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలా పెళ్లి రోజున పురస్కరించుకొని ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోపై రామ్ చరణ్ స్పందిస్తూ ఉప్సి ఐ ఎంజాయ్ బీయింగ్ యువర్ బెటర్ హాఫ్ అంటూ రిప్లై ఇచ్చారు.ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు,అభిమానులు సోషల్ మీడియాలో వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా చిన్నారి క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ చిన్నారి జన్మించి మరి కొద్ది రోజులలో ఏడాది పూర్తి అవుతుంది అప్పటికైనా మెగా ప్రిన్సెస్ ని చూపిస్తారా లేదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ( Game changer ) సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్లతో తదుపరి సినిమాలకు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఈయన తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube