పదవుల కోసం క్యాడర్ వెయిటింగ్ .. ఎప్పుడు భర్తీ చేస్తారో ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చింది.ఆ తర్వాత కొద్ది నెలలకే పార్లమెంట్ ఎన్నికల తంతు మొదలవడంతో,  నామినేటెడ్ పదవులు కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నికల కోడ్ ఎప్పుడు ముగుస్తుందంటూ ఎదురు చూపులు చూశారు.

 Cadre Waiting For The Posts When Will They Be Replaced, Telangana Elections, Tel-TeluguStop.com

ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో,  పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు.రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆలయ చైర్మన్  పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలుపెట్టారు.

పదవుల కోసం ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతల చుట్టూ తిరుగుతూ తమను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Telugu Congress, Telangana-Politics

 తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం , లోక్ సభ ఎన్నికల తంతు ముగియడంతో నామినేటెడ్ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఆరా తీస్తున్నారు.త్వరలోనే ఈ పదవుల భర్తీ కార్యక్రమం ఉంటుందనే సంకేతాలు వెలువడుతుండడంతో,  తమ హోదాకు తగ్గ పదవి కోసం నాయకులు పైరవీలు మొదలుపెట్టారు.అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన నాయకులు,  కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

రాష్ట్ర,  జిల్లా స్థాయి పదవుల కోసం ఎమ్మెల్యేలు,  మంత్రులు ఒత్తిడి మొదలుపెట్టారు.  లోక్ సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర స్థాయిలో అనేకమంది సీనియర్ నేతలకు పదవులు దక్కాయి.

Telugu Congress, Telangana-Politics

నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.కొంతమంది త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండగా.  మిగతావారు నామినేటెడ్ పదవులు ఆశలు పెట్టుకున్నారు.  పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటం,  ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో పదవుల కోసం భారీగా డిమాండ్ ఏర్పడింది .ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అని ఆశావాహులు ఎదురుచూపులు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube