రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట,గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలలో రైతులకు విత్తనాల కొరత రానీయవోద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అదికారులను కోరారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ వరి పత్తి విత్తనాలను అధిక ధరలకు దళారులు విక్రయించకుండా రైతులకు కొరత రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు.
ఇప్పటికే వానాకాలం ప్రారంభమైందని రైతులు పంటలు వేయడానికి భూమిని చదును చేసుకొని సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉంచారన్నారు.
రైతులకు( farmers ) ఎక్కడ విత్తనాల కొరత వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేసి దుకాణాలను తనిఖీ చేయించవలసిన అవసరం ఏర్పడుతుందన్నారు.
రైతులకు సకాలంలో విత్తనాలు అందించి వ్యాపారులు అధికారులు సహకరించాలన్నారు.ఈ విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భానోత్ రాజు నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , కొత్తపల్లి దేవయ్య తదితరులున్నారు.