భారత సంతతికి చెందిన 32 ఏళ్ల మహిళా న్యాయవాది యూకేలో ప్రతిష్టాత్మకమైన ‘‘ Young Pro-Bono Barrister of the Year award ’’ అవార్డును అందుకున్నారు.అంతేకాదు.ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా టినెస్సా కౌర్( Tinessa Kaur ) రికార్డుల్లోకెక్కారు.17 ఏళ్ల వయసులో లీసెస్టర్ నుంచి వెస్ట్ లండన్‌లోని గ్రీన్ఫోర్డ్కు ఆమె మకాం మార్చారు.నిరాశ్రయురాలైన మహిళ కావడంతో చదువుకునేందుకు సిక్కు కమ్యూనిటీపై ఆధారపడింది.ఇప్పుడు కౌర్ .న్యాయవాదిగా విజయం సాధించారని బీబీసీ నివేదించింది.టినెస్సా చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
కుటుంబాన్ని విడిచిపెట్టి ఆమె తండ్రి వెళ్లిపోవడంతో 2009లో 17 ఏళ్ల వయసులో నిరాశ్రయురాలైంది.

అనేక ముఠాల చేతుల్లో, వీధుల్లో పలు ప్రమాదాలకు గురైంది.2010లో టినెస్సా పాఠశాల విద్యను పూర్తి చేసే సమయానికి ఆమె తండ్రి జైలులో ఉన్నారు.దీంతో తనకు సాయం చేయాలంటూ వెస్ట్ లండన్‌లోని గ్రీన్ఫోర్డ్కు వెళ్లి సిక్కు సమాజంలో ఆశ్రయంలో పొందింది.
పట్టుదలతో చదివిన కౌర్ 2013లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన లా డిగ్రీ పూర్తి చేసింది.2019లో కౌర్‌కు బార్ నుంచి పిలుపురాగా.2023లో 32 ఏళ్ల వయసులో ప్యూపిలేజ్ (బార్లో సభ్యునిగా శిక్షణ పొంది, స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడానికి బారిస్టర్‌కు అర్హత సాధించడం) కంప్లీట్ చేసింది.తీరిక వేళల్లో ఆమె తన సమయాన్ని వెనుకబడిన కమ్యూనిటీలకు న్యాయ సహాయం అందించేందుకు కేటాయిస్తోంది.సిక్కు లాయర్స్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకురాలిగా.విద్యార్ధులకు ఒకేలా మద్ధతు, సహాయం చేయడంపై దృష్టిపెట్టారు.

కాగా.కొద్దిరోజుల క్రితం ప్రముఖ భారతీయ నేపథ్య గాయని కనికా కపూర్‌కు ప్రతిష్టాత్మక ‘‘ ఏషియన్ అచీవర్స్ అవార్డ్( Asian Achievers Award )’’ దక్కింది.లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కనికాతో పాటు యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు.భారతీయ భాషల్లో వందలాది పాటలు పాడి సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను కనికా కపూర్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఎన్హెచ్ఎస్ బెక్ల్సీ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ నిక్కీ కనాని ‘‘ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్’’గా నిలిచారు.నార్త్ వెస్ట్ అంబులెన్స్ సర్వీస్ కోసం చేసిన కృషికి గాను సల్మాన్ దేశాయ్( Salman desai ).కోవిడ్ 19 మరణాల తగ్గింపు లక్ష్యంగా శ్రమించిన డాక్టర్ లలిత అయ్యర్‌కు అవార్డ్ లభించింది.