ఉక్రెయిన్( Ukraine ) దేశానికి చెందిన వీడియో బ్లాగర్ స్విట్లానా హైయెంకో( Svitlana Haienko ) గోవాలో తాజాగా వడ పావ్( Vada Pav ) రుచి చూశారు.ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
దాదాపు 50 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న ఓ స్థానిక దుకాణానికి వెళ్ళి, వడ పావ్ తిన్నారు.అదే దుకాణంలో ఉన్న మరో కస్టమర్ ఆమె వడ పావుకు బిల్లు చెల్లించారు.
ఉక్రెయిన్‌కు మద్దతుగానే ఆయన ఆ పని చేశానని, ఆమె వీడియోలో తెలిపారు.ఆయన ఆఫర్ ని స్విట్లానా మొదట వద్దని చెప్పింది, కానీ ఆయన మాత్రం పట్టుబట్టి, ఉక్రెయిన్‌కు తన ప్రేమ చూపించే ప్రయత్నం చేశారు.
ఆ దుకాణం యజమాని రూపేష్( Rupesh ) స్విట్లానాకు పరిచయమయ్యారు.తన దుకాణం 40-50 సంవత్సరాలుగా గోవాలో( Goa ) నడుస్తోందని చెప్పారు.అన్ని సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుందని తెలుసుకోవడం బాగుందని స్విట్లానా చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో స్విట్లానా వడ పావ్ చాలా రుచిగా ఉందని, మృదువైన ఎక్స్‌టీరియర్ దాని టేస్ట్ ను మరింత పెంచిందని చెప్పారు.కష్టమైన సమయాల్లో ఉక్రెయిన్‌కు మద్దతుగా భోజన ఖర్చు చెల్లించిన వ్యక్తి గొప్పతనంపై ఆమె మెచ్చుకున్నారు.ఈ వీడియో స్విట్లానా ఫాలోవర్స్‌కు బాగా నచ్చింది.
ఇండియాలో ఆమె మరిన్ని అనుభవాలు పొందేందుకు వారు సలహాలు ఇచ్చారు.ఆమె ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూడాలని, పంజాబ్‌కు చెందిన అమృత్సరి కుల్చాను రుచి చూడాలని సూచించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 49,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న స్విట్లానా, భారతదేశంలో తన సాహసాలను వీడియోలుగా తీసి తరచుగా షేర్ చేస్తుంది.ఆమె వీడియోలు ఆమె పర్యటనలు, ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభవాలను చూపుతాయి.దేశంలోని విభిన్న రుచులు, సంప్రదాయాలను తెలుసుకుంటూ, ఆమె తన జీవితాన్ని వీడియోల ద్వారా చూపిస్తారు.స్విట్లానా తన వీడియోల ద్వారా తన వ్యక్తిగత ప్రయాణాన్ని మాత్రమే కాకుండా, తాను కలిసిన వ్యక్తుల ఆదరణ, ఆతిథ్యాన్ని కూడా చూపిస్తారు.