పెట్రోల్ బంక్‌లో ఫోన్ వాడకూడదు అని అక్కడి ఉద్యోగులు చెబుతుంటారు పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డ్స్ కూడా పెట్టి ఈ విషయాన్ని తెలియజేస్తారు కానీ కొంతమంది మాత్రం దానివల్ల ప్రమాదం ఏమీ ఉండదు లే అనే నిర్లక్ష్య భావనతో ఉంటారు.అలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత పెద్ద ప్రమాదమో తెలిపే ఒక ఘటన తాజాగా చోటుచేసుకుంది.
ఆ ఘటనలో అదృష్టవశాత్తు ఓ వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.ఇతడు రీసెంట్‌గా ఓ పెట్రోల్ బంక్‌లో( Petrol Bunk ) ఫ్యూయల్ రీఫిల్ చేయించుకోవడానికి వెళ్ళాడు.
ఆ సమయంలో ఆయన మోటార్‌బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.ఆయన మొబైల్ ఫోన్‌కు( Mobile Phone ) కాల్ వచ్చిన సమయంలోనే ఈ భయంకర సంఘటన జరిగింది.
పెట్రోల్ కొడుతుంటే అతను రింగ్ అయిన తన ఫోన్ ని బయటికి తీశాడు.ఫోన్‌ను పెట్రోల్ ట్యాంక్‌కు దగ్గరగా పెట్టడంతో మంటలు రాజుకున్నాయి.
సెక్యూరిటీ కెమెరాలు చూపించింది ఏంటంటే… ఆ వ్యక్తి తన బైక్‌లో( Bike ) పెట్రోల్ నింపుతుండగా.ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది.బైక్ వెంటనే మంటల్లో చిక్కుకుంది.అదృష్టవశాత్తు, ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి కానీ పెద్దగా గాయాలు కాకుండా బయటపడ్డాడు.పెట్రోల్ బంక్‌లో పనిచేసే వారు వేగంగా అగ్నిమాపక పరికరం వాడి మంటలను ఆర్పేశారు.ఎవరికీ గాయాలు కాలేదు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారగా చాలామంది దీనిపై కామెంట్లు చేస్తున్నారు.
మొబైల్ ఫోన్‌ల నుంచి వచ్చే సిగ్నళ్లు పెట్రోల్ పొగలను మండించేస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఫోన్లు ఒకదానితో మరొకటి మాట్లాడుకోవడానికి ఉపయోగపడే ఈ సిగ్నళ్లు( Signals ) చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని, అవి చాలా డేంజరస్ అని కొందరు ఆందోళనలు వ్యక్తం చేశారు.ఈ సిగ్నళ్లు పెద్ద పేలుడుకు కారణమయ్యే స్పార్క్ కు కారణం కావచ్చని వాళ్లు భయపడుతున్నారు.
అయితే ఫోన్ సరిగ్గా పనిచేస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు.ఫోన్ బ్యాటరీ సరిగ్గా పనిచేయకపోతేనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.కానీ ఇలాంటి సమస్య ఉన్న ఫోన్లు చాలా అరుదుగానే ఉంటాయి.పెట్రోల్ లీకేజీ లాంటి ఇతర కారణాల వల్ల కూడా పెట్రోల్ బంకుల్లో పేలుళ్లు జరుగుతాయి.
పెట్రోల్ బంకులో ఫోన్ వాడటం వల్ల ఎప్పుడూ మంటలు రాకపోయినా, జాగ్రత్తగా ఉండటం మంచిది.ఇంధనం నింపుతున్నప్పుడు ఫోన్ వాడకూడదనేది ఒక మంచి నియమం.
ఇలా చేయడం వల్ల అందరూ సురక్షితంగా ఉంటారు.