కోకోనట్ షుగర్ లేదా కొబ్బరి చక్కెర.( Coconut sugar )ఇటీవల కాలంలో దీని వినియోగం భారీగా పెరిగిపోయింది.
వైట్ షుగర్ ఆరోగ్యానికి హానికరం.అందువల్ల చాలా మంది విషపూరితమైన తెల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి చక్కెరను ఎంచుకుంటున్నారు.
వైట్ షుగర్ లో ఎటువంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు.కానీ కొబ్బరి చక్కెరలో ఇనుము, జింక్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
అలాగే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఫైబర్ కూడా ఉంటాయి.అందువల్ల వైట్ షుగర్ తో పోలిస్తే కోకోనట్ షుగర్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అయితే మంచిది అన్నారు కదా అని అతిగా కోకోనట్ షుగర్ ను తీసుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.కోకోనట్ షుగర్ ను కూడా పరిమితంగానే తీసుకోవాలి.ఒక రోజులో ఒక వ్యక్తి 12 గ్రాముల వరకు కొబ్బరి చక్కెరను తీసుకోవచ్చు.సాధారణ చక్కెరలో గ్లూకోజ్( Glucose ) మాత్రమే ఉంటుంది.కొబ్బరి చక్కెరలో ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ రెండూ ఉంటాయి.ఆరోగ్యాన్ని పెంచే శక్తి కొబ్బరి చక్కెరకు ఉంది.

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కొబ్బరి చక్కెర చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఎందుకంటే ఐదు గ్రాముల సాధారణ చక్కెరలో దాదాపు 40 కేలరీలు ఉంటాయి.అదే మొత్తం కొబ్బరి చక్కెరలో 20 నుండి 25 కేలరీలు మాత్రమే ఉంటాయి.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.కొబ్బరి చక్కెరలో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి.ప్రోబయోటిక్స్ జీర్ణక్రియన మెరుగుపరుస్తాయి.
పేగులను ఆరోగ్యంగా మారుస్తాయి.గట్-సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.
కొబ్బరి చక్కెరలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.కాబట్టి మధుమేహం ఉన్న వారు కూడా కొబ్బరి చక్కెరను తీసుకోవచ్చు.
కొబ్బరి చక్కెరలో ఉండే ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ శోషణను మందగించడంలో సహాయపడుతుంది.ఇది మధుమేహం( Diabetes ) వంటి వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.