ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.42
సూర్యాస్తమయం: సాయంత్రం.6.51
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.6.10 ల10.30
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
ఈరోజు మీరు ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి.ధనపరంగా ఇబ్బందులుంటాయి.ఖర్చులు అదుపు చేయడం మంచిది.పనులు నిదానంగా పూర్తవుతాయి.దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.
మిథునం:
ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
కర్కాటకం:
ఈరోజు రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి.నూతన పెట్టుబడులు కలిసిరావు.
సింహం:
ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.దూరపు బంధువులనుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది.
దూర ప్రయాణ సూచనలున్నవి.నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.
ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు.విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.
తుల:
ఈరోజు కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు.విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.బంధువర్గంతో వివాదాలు తీరి ఊరట పొందుతారు.కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు.విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
ధనుస్సు:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కుంభం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.
విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.