రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు చెందిన నాగుల కళావతి అనే మహిళా రైతుకు సంబంధించిన సుమారు 70వేల రూపాయలు విలువ చేసే పాడి గేదె శనివారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు పాడి గేదె రక్షణ కోసం వేసిన రేకులు పాడిగేదే పై పడడంతో మృతి చెందింది.ఇట్టి విషయం తెలుసుకున్న స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్
సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని జిల్లా వైద్యాధికారి కొమురయ్య తో, మండల పశు వైద్యాదికారి రేణుక తో మాట్లాడి పాడి రైతుకు నష్టపరిహరం అందించాలని కోరారు.
బాధిత రైతు ను ఓదార్చారు.ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి అన్నారు.







