అప్పుడు 50 ఇప్పుడు 150.. స్టార్ హీరో బాలయ్య మార్కెట్ ఈ స్థాయిలో పెరిగిందా?

స్టార్ హీరో బాలయ్య సినిమాల బడ్జెట్ అఖండ సినిమా ముందు వరకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అయితే వరుసగా బాలయ్య( Balayya ) సినిమాలు సక్సెస్ సాధించడం బాలయ్యకు ఎంతగానో ప్లస్ అవుతుంది.

 Star Hero Balakrishna Latest Market Update Details, Balakrishna, Balakrishna Mov-TeluguStop.com

బాలయ్య అఖండ 2( Akhanda 2 ) బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలు అనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.బాలయ్య మార్కెట్ ఈ స్థాయిలో పెరిగిందా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య రెమ్యునరేషన్( Balayya Remuneration ) సైతం గత కొన్నేళ్లలో 10 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయలకు పెరిగింది.బాలయ్య తన టాలెంట్ తో ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వరుస విజయాలు బాలయ్య కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.బాలయ్య మాస్ సినిమాలతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాలలో నటిస్తూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Akhanda, Akhanda Budget, Balakrishna-Movie

బాలయ్య క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం నందమూరి అభిమానులకు( Nandamuri Fans ) సంతోషాన్ని కలిగిస్తోంది.రాయలసీమ బాలయ్య అడ్డా అనే సంగతి తెలిసిందే.బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది.హిందూపూర్ లో ఈ సినిమా షూట్ మొదలుకానుందని భోగట్టా.బాలయ్య సినిమాలు రాయలసీమలో( Rayalaseema ) రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.

Telugu Akhanda, Akhanda Budget, Balakrishna-Movie

బాలయ్య అఖండ 2 సినిమాతో సైతం భారీ హిట్ ను అందుకోవాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.బాలయ్య సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.బాలయ్య పుట్టినరోజుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.

బాలయ్య పుట్టినరోజున అదిరిపోయే అప్ డేట్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి.బాలయ్యతో సినిమాలను తెరకెక్కించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube