బాలీవుడ్ డైరెక్టర్ అమీర్ ఖాన్ ( Directed Aamir Khan )మాజీ భార్య కిరణ్ రావు( Kiran Rao ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె డైరెక్టర్గా కంటే అమీర్ ఖాన్ భార్యగానే చాలామందికి సుపరిచితం.
అయితే చాలా ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.కానీ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు.
ఇకపోతే విషయానికి వస్తే.ఈమె ఇటీవల ఇటీవల లపత్తా లేడీస్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

ఏకంగా రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా( Ranbir Kapoor, Sandeep Reddy Vanga ) బ్లాక్‌బస్టర్ మూవీని దాటేసింది.కొద్ది రోజుల్లోనే టాప్‌లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.అమిర్ ఖాన్ మాజీ భార్య అయిన కిరణ్ రావు 2010లో ధోబీ ఘాట్ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపింది.ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు కూడా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా కిరణ్ రావు మాట్లాడుతూ.ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశాను.కేవలం ఇంటి అద్దె కోసమే అడ్వర్‌టైజింగ్ సంస్థల్లో పనిచేశను.
లగాన్ లాంటి ఫీచర్ ఫిల్మ్‌కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు.అడ్వర్‌టైజింగ్ జాబ్స్‌తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించాను.
ఆ ఉద్యోగాల వల్లే కంప్యూటర్లు, కారు వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాను.మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నాను అని ఆమె తెలిపింది.







