ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న హీరోయిన్ శృతి హాసన్.. బాధను భరిస్తున్నానంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ( Shruti Haasan )హెల్తీగా, ఫిట్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.దశాబ్దానికి పైగా కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు కావడం గమనార్హం.

 Heroine Shruti Hasssan Comments About Her Health Issues Details Here Goes Viral-TeluguStop.com

అయితే ఒక షాకింగ్ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నట్టు శృతి హాసన్ వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇటీవల ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.

తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య( Bad periods problem ) ఉందని శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.పీసీఓఎస్ అనే సమస్యతో తాను బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ సమస్య వల్ల మొదటి పీరియడ్ టైమ్ నుంచి ఈ సమస్య పెద్ద పోరాటంగా మారిందని శృతి హాసన్ వెల్లడించారు.పీరియడ్స్ సమయంలో ఈ బాధను నేను భరించాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు.

బ్యాడ్ పీరియడ్ సమయంలో నేను ఏ పనిని సరిగ్గా చేయలేకపోతున్నానని శృతి వెల్లడించారు.

నేను బ్యాడ్ పీరియడ్ వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.ఈ సమస్య వల్ల షూటింగ్స్ ను వాయిదా వేయాలని నేను చెప్పగలనా అంటూ శృతి ప్రశ్నించారు.బాధను భరిస్తూనే కొన్ని సందర్భాల్లో కామెడీ సీన్స్( Comedy scenes ) లో నవ్వుతూ నటిస్తూ పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలను ఈ తరహా సమస్యలు వేధిస్తున్నాయి.

శృతి హాసన్ ఈ సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.శృతి హాసన్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.శృతి హాసన్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

శృతి హాసన్ త్వరలో సలార్2 మూవీ షూట్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube