ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.అది అక్షరాల సత్యం.
సంపద ఎంత ఉన్నా సరే ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనశ్శాంతి కరువవుతుంది.అందుకే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.
అయితే కొన్ని కొన్ని జ్యూసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందులో క్యారెట్ టమాటో జ్యూస్ కూడా ఒకటి.
ఈ జ్యూస్ ను వారానికి ఒక్కసారి తీసుకున్న చాలు అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.పైగా క్యారెట్ టమాటో జ్యూస్ ( Carrot Tomato Juice )తయారు చేసుకోవడం చాలా సులభం.
అందుకోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే అర కప్పు బాగా పండిన టమాటో ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.ఈ జ్యూస్ ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.ఉదయం సమయంలో ఈ జ్యూస్ ను తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.
క్యారెట్ టమాటో జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, కాల్షియంతో సహా మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి.క్యారెక్టర్ టమాటో జ్యూస్ అధిక కొలెస్ట్రాల్ ను కరిగించడానికి, ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.అలాగే ఈ జ్యూస్ ధమనులు మరియు సిరలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి అండంగా నిలబడుతుంది.
మధుమేహం ఉన్నవారు చిన్న మొత్తంలో క్యారెట్ టమాటో జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.అధిక బరువు( Overweight )తో బాధపడుతున్న వారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ జ్యూస్ వెయిట్ లాస్ ను ప్రోత్సహిస్తుంది.ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహకరిస్తుంది.
బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.అంతేకాదు క్యారెట్ టమాటో జ్యూస్ ధూమపానం ద్వారా మీ శరీరానికి జరిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మరియు ఈ జ్యూస్ లో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.