ఇటీవల న్యూజెర్సీ( New Jersey )లో ఒక యువతి రైలు ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకుంది.ఈమె పేరు లిసా ఫిట్జ్‌జెరల్డ్.29 సంవత్సరాల వయసున్న ఈమెను న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్ రైల్వే స్టేషన్‌లో మే 5న న్యూజెర్సీ ట్రాన్సిట్ ( NJT ) రైలు ఢీకొట్టింది.భారీ వర్షం కురుస్తున్న సమయంలో లిసా( Lisa Fitzgerald) న్యూయార్క్ నగరానికి వెళ్లే రైలు కోసం వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే… రైలు వచ్చే ట్రాక్‌పై లిసా ఉంది.దాని పైకి ఆమె ఎలా వెళ్ళిందో తెలియదు కానీ, ఉన్నట్టుండి రైలు ఢీకొట్టిందని, అది ఒక “అనుకోని ప్రమాదం” అని ఆమె తల్లి అభివర్ణించారు.రైలు చివరి భాగాలు ఢీకొట్టడంతో, లిసా కాలు పూర్తిగా తెగిపోయింది.లిసా పాకుతూ ప్లాట్‌ఫామ్ మెట్లు ఎక్కింది.రైలు లోపల చిక్కుకుని మళ్లీ కిందకు పడిపోతానేమో అనే భయంతో వణికిపోయింది.ప్రయాణీకులు, చుట్టుపక్కల వారు లిసా అరుపులను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు.
చివరికి మోరిస్‌టౌన్( Morristown ) అగ్నిమాపక శాఖ అధికారులకు సహాయం చేసి, రైలు కింద చిక్కుకున్న లిసా కాలును తిరిగి తీసుకువచ్చింది.లిసాను ఆసుపత్రికి తరలించారు, కానీ ఆమె కాలు తిరిగి అమర్చడం అసాధ్యం అని వైద్యులు తేల్చారు.మోరిస్‌టౌన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఈ ఘటనను ధృవీకరించింది, అధికారుల వేగవంతమైన స్పందన, ప్రాణాలను కాపాడే చర్యలను ప్రశంసించింది.ఈ దుర్ఘటన జరిగినప్పుడు లిసా 30వ పుట్టినరోజు వేడుకకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది.
భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, లిసా ధైర్యంతో పోరాడింది.ట్రాకులపై ఉండి తన ప్రాణాలను పోగొట్టుకోవాలనుకోలేదు.బతకాలనే ఆశతో ప్లాట్‌ఫామ్ పైకి ఎక్కి సహాయం కోసం వెయిట్ చేసింది.చివరికి దేవుడి దయవల్ల ఆమెకు సహాయం అంది ఇప్పుడు బతకగలిగింది.
కాలు మాత్రం లేదు కానీ ఆమెకు నిత్యం సపోర్ట్ అందించే వారు మాత్రం వెన్నంటే ఉంటున్నారు.