యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణ ప( Aler )రిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోడ్రైనేజీ వ్యవస్థ ( Drainage system )అస్తవ్యస్తంగా తయారై మురుగు నీరు బయటకు పోయే మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని,ఎన్నిసార్లుఅధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపిస్తూ ఇళ్ల మధ్య ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ సమయంలో డ్రైనేజీ నిరు బయటకు పోవడానికి రెండు పెద్ద మోరీలు,పక్కన సిసి రోడ్డు వేశారని,అప్పట్లో మోరీ గుండా డ్రైనేజీ నీరు ఇండ్ల వెనుక భాగంలోని భూముల నుండి వాగులోకి చేరేదన్నారు.ఆ తర్వాత చుట్టుపక్కల భూములవాళ్లు అభ్యంతరాలు చెప్పడంతో ఇప్పుడు మురుగునీరు వెళ్లే మార్గం లేకుండా పోయిందని,ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ చైర్మన్ కు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
45 రోజులుగా ఇళ్లలోకి నీరు రావడం దుర్వాసనతో జీవించలేకపోతున్నామంటూ ఇండ్లలో పడుకోవాలంటే నిద్ర పట్టడం లేదని దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎండాకాలమే ఈ విధంగా ఉంటే వచ్చేది వర్షాకాలం ఇంకా ఏ విధంగా ఉంటుందోనని అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు నీరు బయటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.