ఆసుపత్రిలోనే కీచక పర్వం.. ఉద్యోగులపై లైంగిక వేధింపులు, భారత సంతతి వైద్యుడిపై అభియోగాలు

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యుడిపై యూకే పోలీసులు( UK Police ) అభియోగాలు మోపారు.వాయువ్య ఇంగ్లాండ్‌లోని లంకాషైర్‌‌లో ఉన్న బ్లాక్‌పూల్ విక్టోరియా హాస్పిటల్‌లో సదరు డాక్టర్ .

 Indian-origin Surgeon Charged Over Sexual Offences In Uk , Crown Prosecution Ser-TeluguStop.com

లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.నిందితుడిని 54 ఏళ్ల అమల్‌బోస్‌గా( Amalbos ) గుర్తించారు .ఉద్యోగినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, గతేడాది మార్చిలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అమల్‌బోస్‌ను ఆసుపత్రి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) ఆదేశాలు జారీ చేసింది.క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్( Crown Prosecution Service ) (సీపీఎస్)తో సంప్రదింపుల తర్వాత పోలీసులు శుక్రవారం బోస్‌పై అభియోగాలు మోపారు.

ఈ నేపథ్యంలో జూన్ 7న లాంకాస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుకావడానికి బోస్‌ను బెయిల్‌పై విడుదల చేశారు.

లాంకాస్టర్ సమీపంలోని థర్న్‌హామ్‌కు ( Thurnham, near Lancaster )చెందిన అమల్‌బోస్ .ఆరుగురు మహిళా బాధితులపై లైంగిక నేరాల చట్టం 2003లోని సెక్షన్ 3కి విరుద్ధంగా 14 లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా అభియోగాలు మోపారు.2017 – 2022 మధ్యకాలంలో బోస్ ఈ చర్యలకు పాల్పడ్డాడు.అతనిపై ఆరోపణలు చేసిన బాధితులంతా బ్లాక్‌పూల్ విక్టోరియా హాస్పిటల్‌లోని( Blackpool Victoria Hospital ) సిబ్బందేనని పోలీసులు తెలిపారు.ఫిర్యాదులకు ముందు బ్లాక్‌పూల్ విక్టోరియా హాస్పిటల్‌లో కార్డియోవాస్కులర్ సర్జరీ విభాగానికి బోస్ అధిపతిగా ఉన్నారు.

అతను మాజీ సిబ్బందిపై లైంగిక వేధింపుల నేరాలకు పాల్పడినట్లు ట్రస్ట్ నిర్ధారిస్తుందని ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు.

Telugu Amalbos, Crown, England, Indianorigin, Lancaster, Thurnham-Telugu Top Pos

కాగా.ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.ఇంగ్లాండ్‌లో( England ) తన వద్ద చికిత్స తీసుకుంటున్న మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతికి చెందిన వైద్యుడు తన నేరాన్ని అంగీకరించాడు.

ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌లోని హవంత్‌లోని స్టాంటన్ సర్జరీలో మాజీ జనరల్ ప్రాక్టీషనర్ మోహన్ బాబు పోర్ట్స్‌మౌత్ క్రౌన్‌ కోర్టులో మూడు వారాల పాటు జరిగిన విచారణకు హాజరయ్యాడు.

Telugu Amalbos, Crown, England, Indianorigin, Lancaster, Thurnham-Telugu Top Pos

లైంగిక వేధింపులు సెప్టెంబర్ 2019 నుంచి జూలై 2021 మధ్య జరిగాయని.బాధితులలో 19 ఏళ్ల యువతి కూడా వున్నట్లు కోర్టు పేర్కొంది.అదే క్లినిక్‌లో జనరల్ ప్రాక్టీషనర్ అయిన తన భార్యతో పాటు మోహన్ బాబు పనిచేసిన స్టాంటన్ సర్జరీ ప్రాంగణంలో ముగ్గురు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు.

మోహన్ బాబుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.బాధితులను అనుచితంగా తాకడం, గగుర్పాటు కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటి వాటిపై ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube