ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ హనుమంతు కే.జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే( Hanumant K Zendage ) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు.

 Grain Procurement Should Be Speeded Up Collector Hanumant K Zendage , Hanumant K-TeluguStop.com

మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మిర్యాల గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బొమ్మలరామారం తహశీల్దార్ శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.రిజిష్టర్లను,లారీల రవాణా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి ఇబ్బందులు ఎదురవుతున్నాయని,ధాన్యం త్వరగా లారీలకు ఎత్తి మిల్లుల్లో త్వరగా అన్లోడ్ చేయాలని ఆదేశించారు.అనంతరం రైతులతో మాట్లాడుతూ పండించిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు.

ఈ నెల 27న జరిగే నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్బంగా జిల్లా వ్యాప్తంగా వైన్స్ బంద్ చేయడం జరుగుతుందని, ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికలు పరదర్శకంగా నిర్వహించేందుకు వైన్స్ బంద్ చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube