ప్రతినిత్యం సోషల్ మీడియా( Social media)లో అనేక రకాల వైరల్ వీడియోలు గమనిస్తూనే ఉంటాం.అందులో ఎక్కువగా ఫన్నీ వీడియోలో ఉంటే మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలో ఎక్కువగా చూస్తూ ఉంటాం.
తాజాగా కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం వేసవికాలం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
ఇందుకోసం ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి తప్పించుకునేందుకు అనేక రకాల ప్లాన్లు వేస్తూ ఇంట్లోకి బీసీలు కూలర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.లేకపోతే మనుషులైతే ఇలా ఏదో ఒకటి చేసి చల్లగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక జంతువులు పెరిగిపోతున్న ఉష్ణోగ్రత నుండి తప్పించుకునేందుకు ఇబ్బంది పడుతున్నాయి.ఎండను అలమటించి మూగజీవాలు ఇబ్బందులకు గురవుతున్నాయి.ఇకపోతే ఓ కుక్క( Dog ) కూడా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వెరైటీగా ఆలోచించింది.ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వైరల్ గా మారిన వీడియోలో ఓ కుక్క ఎండవేడికి తట్టుకోలేక ఇంట్లోనే ఫ్రిడ్జ్( Refrigerator) లోకి వెళ్లి కూర్చుంది.ఫ్రిజ్ లో అట్టడుగు బాగాన ఉన్న కూరగాయల కంటైనర్ పై హాయిగా సేద తీరుతుంది.
అయితే ఈ విషయాన్ని గమనించిన ఇంట్లోనే వ్యక్తులు షాక్ అయ్యారు.
ఫ్రిడ్జ్ లో ఉన్న కుక్కను బయట తీసేందుకు ఇంట్లోనే మహిళ ప్రయత్నం చేయగా బయటకు రావడానికి ఇష్టపడడం లేదు.దాంతో ఆ మహిళా బలవంతంగా కుక్కను ఫ్రిడ్జ్ నుండి బయటకు లాగేసింది.ఈ వీడియో చూసినందుకు నెటిజెన్స్ అందరూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో కొందరైతే.బయట చాలా వేడిగా ఉంది సోదరా.
, కుక్క చేసిన దానిలో ఎలాంటి తప్పులేదు అంటూ కామెంట్ చేయగా., మరొకరు అయితే ఇలాంటి వాటికోసం డీప్ ఫ్రీజర్ను తీసుకొని అందులో వాటికి ఒక బెడ్ ఏర్పాటు చేయాలంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.