బాడీలో వేస్ట్ పెరిగిపోయే కొద్ది రకరకాల జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందువల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడం ఎంతో అవసరం.
అయితే శరీరాన్ని శుద్ధి చేయడానికి ఇప్పుడు చెప్పబోయే డిటాక్స్ డ్రింక్( Detox Drink ) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.నిత్యం ఉదయం ఈ డ్రింక్ ను తాగారంటే బాడీ క్లీన్ అవ్వడమే కాకుండా మరెన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డిటాక్స్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న క్యారెట్ ను ( Carrot ) తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో క్యారెట్ తురుము వేసుకోవాలి.అలాగే పది ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ( Chia Seeds ) చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.
చివరిగా వన్ లీటర్ వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా వదిలేస్తే మన డిటాక్స్ డ్రింక్ అనేది సిద్ధం అవుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో డిటాక్స్ డ్రింక్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.బాడీని డీటాక్స్ చేస్తుంది.
అలాగే ఈ డ్రింక్ ను మార్నింగ్ తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉంటే పరార్ అవుతాయి.
బరువు తగ్గాలి అని భావిస్తున్న వారికి కూడా ఈ డ్రింక్ ఉపయోగకరంగా ఉంటుంది.ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచుతుంది.
ఈ డ్రింక్ తాగిన తర్వాత ఒక అరగంట పాటు వ్యాయామం చేశారంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.పైగా ఈ డ్రింక్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.