ప్రతి ఒక్కరూ ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకుంటారు.కానీ ఆ ఉన్నతమైన లాక్ష్యాలను కష్టపడి సాధించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు.
అయితే ఎంతో కష్టపడి లక్ష్యాలను సాధించిన వాళ్లలో పొటుపురెడ్డి భార్గవ్( Potupureddy Bhargav ) ఒకరు. ఐ.ఎఫ్.ఎస్ పరీక్షలో( IFS Exam ) భార్గవ్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించారు.విజయనగరం జిల్లాలోని( Vizianagaram District ) పెదవేమలి గ్రామానికి చెందిన భార్గవ్ ఒకరు.బాల్యం నుంచి నేను బాగా చదివేవాడినని భార్గవ్ అన్నారు.
నాన్న హెడ్ కానిస్టేబుల్ అని చెల్లి ఎంబీబీఎస్ పూర్తి చేసిందని భార్గవ్ చెప్పుకొచ్చారు.ఇంటర్ తర్వాత ఐఐటీ బాంబేలో( IIT Bombay ) సీట్ వచ్చిందని అక్కడే మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశానని భార్గవ్ అన్నారు.
క్యాంపస్ లోనే సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని భార్గవ్ చెప్పుకొచ్చారు.నాన్న ప్రోత్సాహంతో కెరీర్ పరంగా ముందడుగులు వేశానని భార్గవ్ వెల్లడించడం గమనార్హం.
రెండు ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదని మూడు, నాలుగో ప్రయత్నాలలో మాత్రం మంచి ఉద్యోగాలే సాధించినా ఐ.ఎఫ్.ఎస్ లక్ష్యంగా ముందడుగులు వేశానని భార్గవ్ అన్నారు.ఏపీ, తెలంగాణలకు నాదే మొదటి ర్యాంక్ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆప్షనల్ గా కెమిస్ట్రీ( Chemistry ) ఎంచుకున్నానని భార్గవ్ వెల్లడించారు.రోజుకు కనీసం 6 గంటలు ప్రిపేర్ అయ్యానని భార్గవ్ వెల్లడించారు.
సమయం చాలా విలువైనదని సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ సాధించడం సులువేనని ఆయన అన్నారు.భార్గవ్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎదిగి సక్సెస్ అయిన భార్గవ్ ప్రశంసలు అందుకుంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.భార్గవ్ టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
కష్టపడి చదివితే సివిల్స్ లో కూడా సక్సెస్ సాధించడం సాధ్యమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భార్గవ్ సక్సెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.