తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.
కరెంట్ కోతల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు వేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఉండేలా పటిష్టమైన వ్యవస్థను నిర్మించామని పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని విమర్శించారు.సీఎం రేవంత్ పాలనపై దృష్టి పెడితే మంచిదని ట్విట్టర్ వేదికగా హరీశ్ రావు సూచించారు.