యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు నియోజకవర్గం( Alair Assembly constituency)లో మంగళవారం సాయంత్రం నుండి కురిసిన ఈదురు గాలులు,ఉరుములు మెరుపులలతో కూడిన అకాల వర్షానికి అన్నదాత పరిస్థితి అతలాకుతలమైంది.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు టార్పాలిన్ పట్టాలు లేక తడిసి ముద్దవగా,వరదకు వడ్లు కొట్టుకుపోకుండా రైతులు నానా అవస్థలు పడ్డారు.
మరి కొన్ని కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తుగా బస్తాలపై కప్పిన టార్పాలిన్ పట్టాలు ఎగిరిపోయి బస్తాల్లో ధాన్యం కూడా తడిసింది.
ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో చెట్లు కూలిపోగా,కొలనుపాక జైన దేవాలయం ఎదుట భారీవృక్షం నేలకొరిగింది.
రాజపేట,తుర్కపల్లి మండల్లాల్లో మామిడి తోటల్లో కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలడంతో రైతులకు( Farmers ) అపార నష్టం వాటిల్లింది.దీనితో అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరుణుడి దెబ్బకు నీళ్ళ పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.అలాగే నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.







