సమ్మర్ లోనూ స్కిన్ గ్లోయింగ్ గా మెరవాలా.. అయితే మీరీ న్యాచురల్ టోనర్ వాడాల్సిందే!

ప్రస్తుతం వేసవి కాలంలో అధిక వేడి, మండే ఎండలు ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా చాలా డ్యామేజ్ చేస్తుంటాయి.ముఖ్యంగా వేస‌విలో స్కిన్ టాన్ అయిపోవడం, ముఖంలో మెరుపు మాయం అవడం వంటివి అందరూ కామన్ గా ఫేస్ చేసే సమస్యలు.

 Try This Natural Toner For Glowing Skin In Summer! Glowing Skin, Summer, Natural-TeluguStop.com

అయితే వీటికి చెక్ పెట్టి సమ్మర్( Summer ) లోనూ స్కిన్ ను గ్లోయింగ్ గా మెరిపించడానికి ఒక అద్భుతమైన టోనర్ ఉంది.ఆ టోనర్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? ఆ న్యాచురల్ టోనర్ ను వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Dry Skin, Face, Skin, Homemade, Natural, Rose, Skin Care, Skin Care

ముందుగా ఒక కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక కప్పు కీరా దోసకాయ జ్యూసులో అర కప్పు బియ్యం కడిగిన వాటర్, మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ సిద్ధం అవుతుంది.

ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Dry Skin, Face, Skin, Homemade, Natural, Rose, Skin Care, Skin Care

ఆ త‌ర్వాత ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి వాట‌ర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న టోనర్ ను ఒకటికి రెండుసార్లు ముఖానికి మెడకు స్ప్రే చేసుకోవాలి.ఇప్పుడు చెప్పుకున్న న్యాచురల్ టోనర్ ను వేసవికాలంలో రోజుకు రెండుసార్లు వాడారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.

ఈ టోనర్ చర్మం లో తిరిగి తేమను నింపుతుంది.డ్రై స్కిన్( Dry skin ) ను దూరం చేస్తుంది.

టాన్ ను రిమూవ్ చేస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

చర్మంపై ఏమైనా మొండి మచ్చలు ఉంటే వాటిని క్రమంగా మాయం చేస్తుంది.మేకప్ లేకపోయినా కూడా ఈ టోనర్ మిమ్మల్ని సహజంగానే అందంగా మెరిసేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube