మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్...!

నల్లగొండ జిల్లా: ఆసియా ఖండం మొత్తం ప్రస్తుతం భగభగలాడుతోంది.దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.

 Burning Sun Hundred Years Record Break, Burning Sun ,hundred Years Record Break,-TeluguStop.com

కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.పలు ప్రాంతాల్లో భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు.1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి.ఈ మధ్య కాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.

ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ తొలి వారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న సూరీడు.

రోజురోజుకు మరింత మండిపోతున్నాడు.

ఫలితంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారాణంగా మారిపోయింది.అంతేకాదు, వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

తూర్పు,దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది.

అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నష్టం,వ్యాధులు వ్యాప్తి చెందడం,భూగర్భ జలాలు క్షీణించడం జరుగుతుంది.గ్లోబల్ వార్మింగ్ అనేది మన పిల్లల తరానికి మనం అందించబోతున్న గొప్ప ప్రతిఫలం.

మనిషి స్వార్థమే మండుతున్న ఎండలకు కారణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube