టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ త్రిష( Trisha )కు మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే.చాలామంది హీరోయిన్లు ఎక్కువకాలం సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే త్రిష మాత్రం వరుస విజయాలతో కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.అయితే త్రిష ఈ స్థాయిలో ఉండటానికి ఒక షరతు కారణమట.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రెండేళ్ల షరతు ఆమె జీవితాన్ని మార్చేసిందట.
క్రిమినల్ సైకాలజీ చదవడం త్రిష కల కాగా హైస్కూల్ లో చదివే సమయంలోనే ఆమె లాయర్ కావాలని అనుకున్నారు.కాలేజ్ లో చేరిన తర్వాత త్రిషకు మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది.మొదట త్రిషకు చిన్నచిన్న యాడ్స్ లో ఛాన్స్ దక్కింది.
ఆ తర్వాత జోడీలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా కనిపించారు.సినిమాల్లోకి వెళ్తానని త్రిష చెప్పగా రెండేళ్లు ప్రయత్నించాలని నీకు కంఫర్ట్ అనిపిస్తే నటన కొనసాగించాలని తల్లి సూచించారు.
అలా జరగకపోతే బుద్ధిగా చదువుకోవాలని తల్లి చెప్పారు.ఆ రెండేళ్ల షరతుకు అంగీకరించి త్రిష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.వర్షం సినిమా సక్సెస్ సాధించడంతో త్రిష జీవితం మలుపు తిరిగింది.వర్షం సినిమా ( Varsham )సక్సెస్ సాధించడంతో త్రిష కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.
కోడి సినిమాలో త్రిష నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించారు.త్రిష తన సినీ కెరీర్ లో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు.తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేశ్ ఇలా నలుగురు సీనియర్ హీరోలకు త్రిష జోడీగా నటించారు.16 సంవత్సరాల వయస్సులోనే ఆమె మిస్ చెన్నై ( Miss Chennai )టైటిల్ గెలుచుకున్నారు.హనీ, ది టెర్రర్ ఆమె ముద్దు పేర్లు కాగా ఏదైనా పనిని అనుకుంటే ఆమె వెంటనే పూర్తి చేస్తారు.ఈరోజు త్రిష పుట్టినరోజు కాగా ఆమె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం.