రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలనీ కోరుతూ ఎల్లారెడ్డిపేట మండలం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్.లు బండలింగంపల్లి గ్రామంలో ఎన్నికల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షులు చెన్ని బాబు తో పాటు జిల్లా నాయకులు వివిధ అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ మండల శాఖల అద్యక్షులు వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటీ నరసయ్య ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ గెలిపించి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గెలిపించినట్లు ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను పార్లమెంటు సభ్యులుగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, రాష్ట్రంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడి మచ్చలేని నాయకుడైన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్,హరీష్ రావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధి రావడం లేదని తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే రీతిన బిఆర్ ఎస్ పార్టీ కి, బిజెపి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు.బి ఆర్ ఎస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసి పది సంవత్సరాల కాలంలో ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదని వారు తీవ్రంగా విమర్శించారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది , అయినప్పటికీ బీఆర్ఎస్ బిజెపి పార్టీలు కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారెంటీలను నమ్మొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే పార్లమెంట్లో కూడా 14 ఎంపీ స్థానాలు ఉంటేనే మరింత అభివృద్ధి మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకోవచ్చని ప్రజలు ఇది గ్రహించాలని బిఆర్ఎస్ , బిజెపి లకు ఓటు వేసి ఓటును పాడు చేసుకోవద్దని వారు కోరారు.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావ్ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు.బండలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గడప గడప కు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్ల ను ఓట్లు అభ్యర్థించారు , ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్ , అల్మాస్పూర్ అక్క పెళ్లి, దుమాల వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి పరిశీలించారు.